- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమ్యూనిస్టు నేత నల్లకన్ను మృతి
కమ్యూనిస్టు నేత నల్లకన్ను మృతి చెందడం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, స్వాతంత్ర పోరాట సమరయోధులు కామ్రేడ్ ఆర్. నల్ల కన్ను బుధవారం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. ఆయన మృతి యావత్తు కమ్యూనిస్టు పార్టీకి, తమిళనాడు రాష్ట్రానికి తీరని లోటుగా సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి.డాక్టర్.కే. నారాయణ తెలిపారు. 1925 వ సంవత్సరంలో పుట్టిన నల్ల కన్ను భారత దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సైన్యానికి ముచ్చమటలు పట్టించారని గుర్తుచేశారు. ఆ తరువాత మార్క్స్ ,లెనిన్ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీలో తనను విలీనం చేసుకుని వర్గ, కుల వివక్షకు వ్యతిరేకంగానూ, ప్రజా సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేసిన ఎర్రజెండా ముద్దుబిడ్డ అని ఆయన సేవను కొనియాడారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల గుండెల్లో గాంధీగా పేరుపొందిన నల్ల కన్ను లేరని నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఢిల్లీలో నల్లకన్ను చిత్రపటానికి సీపీఐ జాతీయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కె.రామకృష్ణలు నివాళలర్పించారు.
మగ్ధూంభవన్ లో…
హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట్ర ఆఫీసు మగ్ధూంభవన్ లో నల్లకన్ను చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిసాంబశివరావు నివాళలర్పించారు. ఈ సందర్బంగా సాంబశివరావు మాట్లాడుతూ నల్లకన్ను సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, రాష్ట్ర కార్యాలయం కార్యదర్శి గోవింద్, రాష్ట్ర కార్యాలయం ఇన్చార్జి బోయ శ్రీరాములు, దశరథ్, బోడ అంజయ్య పాల్గొని నివాళులర్పించారు.






