భజరంగ్ దళ్ కార్యకర్తలను తరిమి కొట్టిన సామాన్యులు

by Muthe.Rajitha |

లవర్స్ ను వేధిస్తున్న భజరంగ్ దళ్ గుండాలను స్థానికులు అడ్డుకున్న ఘటన జైపూర్ లో చోటు చేసుకుంది.

భజరంగ్ దళ్ కార్యకర్తలను తరిమి కొట్టిన సామాన్యులు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమికుల దినోత్సవం సందర్భంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమ జంటలను మందలించడం చూస్తుంటాం. కానీ ప్రేమజంటలను వేధిస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్తలను స్థానికులు తరిమికొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో వాలెంటైన్స్ డే రోజున మోరల్ పోలీసింగ్ పై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఫిబ్రవరి 14న జైపూర్ లోని ఒక పబ్లిక్ పార్క్‌లో లవర్స్ ను బెదిరిస్తూ, మోరల్ పోలీసింగ్ కు దిగారు కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలు. ప్రేమజంటలను విచారిస్తూ.. "వాలెంటైన్స్ డే జరుపుకోవద్దు", "ఇది పాశ్చాత్య సంస్కృతి" అంటూ హెచ్చరించారు.

అంతేకాదు కొందరు కర్రలు కూడా పట్టుకోవడంతో లవర్స్ వణికిపోయారు. అయితే ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న స్థానికులు, కొంతమంది యువత భజరంగ్ దళ్ కార్యకర్తలను నిలదీశారు. వారి రౌడీయిజంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "అసలు మీరంతా ఎవరు?”, "మీ సంస్థలో మీకున్న ఐడెంటీ కార్డ్స్ చూపించండి" అంటూ వారిని నిలదీశారు. పరిస్థితి వేడెక్కడంతో మెల్లగా భజరంగ్ దళ్ కార్యకర్తలు పార్కు నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై నెటిజన్స్ స్పందిస్తూ.. "పబ్లిక్ యూనిటీ"గా అభివర్ణిస్తుండగా, మరికొందరు "వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడారు" అంటూ పేర్కొన్నారు. అయితే ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకపోయినా వాలెంటైన్స్ డే సందర్భంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మోరల్ పోలిసింగ్ ఘటనలు చోటుచేసుకోవడం ఇటీవల కాలంలో సాధారణం కాగా.. జైపూర్‌లో ఈసారి స్థానిక ప్రజలే భజరంగ్ దళ్ గుండాలను అడ్డుకోవడం స్పెషల్ గా నిలిచింది.

Next Story