మరోసారి పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు!

by Muthe.Rajitha |

దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి.

మరోసారి పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు!
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది. జూన్ 1(ఈరోజు) నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. ఇది చిన్న పెంపే అయినప్పటికీ, గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న ధాబాలు నడుపుకునే వ్యాపారస్తులకు ఇది అదనపు భారంగా మారింది. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేకపోవడం గృహిణులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ తాజా పెంపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో సిలిండర్ ధర రూ. 42 పెరగడంతో, ఇక్కడ కొత్త ధర రూ. 3,113.50 కి చేరింది. ఇక కోల్‌కతాలో గరిష్టంగా రూ. 53.50 పెరగడంతో, కొత్త ధర రూ. 3,255.50 గా నమోదైంది. ముంబైలో సుమారు రూ. 3,024 దాటింది.

వరుస పెంపునకు గల కారణాలు

కమర్షియల్ గ్యాస్ ధరలు గత కొన్ని నెలలుగా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మే నెలలో భారీగా రూ. 993 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులు, పశ్చిమ ఆసియా (West Asia) ప్రాంతంలో నెలకొన్న తీవ్ర భౌగోళిక ఉద్రిక్తతలు. అంతర్జాతీయసప్లై చైన్ లో తలెత్తుతున్న ఇబ్బందులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నిరంతర పెంపు వల్ల రాబోయే రోజుల్లో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Next Story