- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతరలో కుప్పకూలిన 'కొలంబస్ రైడ్'.. 14 మందికి తీవ్ర గాయాలు
by Muthe.Rajitha |
మధ్యప్రదేశ్‌లోని జబువా పట్టణంలో జరుగుతున్న జాతరలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని జబువా పట్టణంలో జరుగుతున్న జాతరలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. జబువాలోని గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సమీపంలో నిర్వహిస్తున్న ‘మహారాజ్ నో మేలో’ జాతరలో ఏర్పాటు చేసిన 'డ్రాగన్ స్వింగ్'( కొలంబస్ రైడ్) అకస్మాత్తుగా విరిగి కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో 13 మంది బాలికలు ఉండటం గమనార్హం. సరదాగా స్వింగ్‌లో ఊగుతున్న సమయంలో ఒక్కసారిగా ఇది కూలిపోవడంతో జనం భయంతో హాహాకారాలు చేసారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన పిల్లలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ నేహా మీనా ఘటనపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు. స్వింగ్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






