మున్సిపల్ ఎన్నికల బరిలో కల్నల్ సంతోష్ బాబు మాతృమూర్తి

by Muthe.Rajitha |

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

మున్సిపల్ ఎన్నికల బరిలో కల్నల్ సంతోష్ బాబు మాతృమూర్తి
X

దిశ, వెబ్ డెస్క్ : సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘటనలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుడు కల్నల్ సంతోష్ బాబు మాతృమూర్తి మంజుల మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగడం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ తరపున ఎన్నికల్లో పోటీ చేయనున్న మంజుల మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం తన కుమారుడిని కోల్పోయానని, తల్లి ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. స్థానిక సమస్యలు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. మహిళల సంక్షేమం, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు వంటి సమస్యలపై దృష్టి పెడతానని వెల్లడించారు. ఈ మేరకు 44వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా.. ఆమెకు సూర్యాపేట పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

Next Story