- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్‌వాయిలో కలెక్టర్ పర్యటన.. ఇందిరమ్మ ఇళ్ల పై కీలక ఆదేశాలు
రామారెడ్డి మండలంలోని మంగళవారం ఉప్పల్‌వాయి గ్రామంలో పర్యటించిన కలెక్టర్, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

దిశ, సదాశివ నగర్( రామారెడ్డి) : రామారెడ్డి మండలంలోని మంగళవారం ఉప్పల్‌వాయి గ్రామంలో పర్యటించిన కలెక్టర్, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
ఇందిరమ్మ ఇండ్లు : గ్రామానికి మంజూరైన 25 ఇందిరమ్మ ఇండ్లలో 10 ఇళ్ల నిర్మాణం పూర్తై లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. మిగిలిన 15 ఇళ్లు రూఫ్ లెవెల్‌లో ఉన్నాయని అధికారులు వివరించారు. నిర్మాణాన్ని వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
SIR ప్రక్రియ : సుమారు 80% పని పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేస్తామని మండల తహసీల్దార్ ఉమామలత తెలిపారు.
పాఠశాల తనిఖీ – శాస్త్రీయ దృక్పథం ప్రోత్సాహం..
గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన బోధన పై ఉపాధ్యాయులను అభినందించారు.
అటల్ టింకరింగ్ ల్యాబ్ : పాఠశాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు.
పక్షుల పరిశీలన : పాఠశాల పరిసరాలకు వచ్చే పక్షుల రాకపోకలు, వాటి ప్రవర్తన, సంఖ్య, జీవన విధానం పై విద్యార్థులు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో 20 రోజుల పాటు పరిశీలన నిర్వహించి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.
ఇలాంటి పరిశోధనాత్మక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, పరిశీలనా నైపుణ్యం పెంపొందుతుందని కలెక్టర్ అన్నారు.
జిల్లాలోని 41 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఉన్న పాఠశాలలన్నీ ఈ కార్యక్రమాన్ని ఒక సవాల్‌గా స్వీకరించి అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, పీడీ హౌసింగ్ విజయ్‌పాల్ రెడ్డి, మండల తహసీల్దార్ ఉమామలత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






