- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ వేగవంతం చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమంలోని 'ఎన్యూమరేషన్ ఫారాల' స్వీకరణను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా 100 శాతం డిజిటైజేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు.

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమంలోని 'ఎన్యూమరేషన్ ఫారాల' స్వీకరణను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా 100 శాతం డిజిటైజేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న ఓటర్లు వాటిని పూర్తిగా నింపి వెంటనే సంబంధిత బూత్ లెవల్ అధికారులకు(బిఎల్‌ఓలకు) అందజేయాలని, ఇంకా ఫారాలు సమర్పించని వారు వెంటనే సమర్పించాలని ఆమె సూచించారు.
ఎన్యూమరేషన్ ఫారాలు అందుకొని వారి వివరాలను బీఎల్ఓలు పరిశీలించి వెంటనే డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఫారాలు సమర్పించని ఓటర్ల పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదు కావని, దీంతో వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. కాబట్టి ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సకాలంలో సమర్పించి, ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు నమోదయ్యేలా బిఎల్ఓ లు చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా, వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రజలందరూ అధికారులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు






