- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు అజిత్‌కు సీఎం విజయ్ పరామర్శ
తమిళనాడు సీఎం నటుడు విజయ్ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) తల్లి మోహిని మణి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు సీఎం నటుడు విజయ్ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) తల్లి మోహిని మణి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వృద్ధాప్య కారణాలతో మోహిని మణి మే 30న చెన్నైలో కన్నుమూశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ సంతాప సందేశం విడుదల చేస్తూ, “నా ప్రియ స్నేహితుడు అజిత్ కుమార్ తల్లి మోహిని అమ్మాయియార్ మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. అజిత్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు. అంతేకాకుండా విజయ్ స్వయంగా అజిత్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు సమాచారం. ఈ సందర్భంగా నటి త్రిష కూడా విజయ్ తో పాటు అజిత్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మోహిని మణి మృతిపట్ల తమిళ సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.






