తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం

by Malleboina Mahesh |   (  Updated:2026-05-11 08:11:38  IST  )

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 9 మంది మంత్రులు మరియు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక నూతన శకం ఆరంభమైంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీ. జోసెఫ్ విజయ్ (Joseph Vijay,), ఆయన మంత్రి మండలి సభ్యులు సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం (Oath taking) చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ ఎం.వి. కరుప్పయ్య నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ముఖ్యమంత్రి విజయ్ అందరికంటే ముందుగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం ఎన్. ఆనంద్, ఆదవ్ అర్జున సహా తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తో పాటు నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఒకప్పటి స్టార్ హీరోగా ఉన్న విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరో ట్విస్ట్ ఇచ్చిన విజయ్.. స్టాలిన్‍తో భేటీకి నిర్ణయం!

Next Story