- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన పెను ప్రమాదం
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి పెను ప్రమాదం తప్పింది.

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి పయనమవగా, జాతీయ రాజధాని ప్రాంతంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణం కారణంగా వారి విమానాన్ని రాజస్థాన్‌లోని జైపుర్‌కు అత్యవసరంగా మళ్లించారు.
కర్ణాటక CMO వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రత్యేక విమానంలో సిద్ధరామయ్యతో పాటు ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, పలువురు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. జైపుర్‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటకలో తలెత్తిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ కావడానికి సిద్ధరామయ్య ఈ పర్యటన చేపట్టారు. విమానం దారిమళ్లడం వల్ల శుక్రవారం ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కీలక సమావేశం కానున్నారు.






