- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీ పలుకుబడిని ఉపయోగించండి’.. కిషన్ రెడ్డికి CM రేవంత్ లేఖ
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు ఫేజ్-II మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలియజేశారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో జరిగిన సమావేశం మేరకు, మెట్రో ఫేజ్-II కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేపడుతోందని తెలియజేస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన ఒక సంయుక్త కమిటీలో చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు అధికారులను నామినేట్ చేసేందుకు వేచి చూస్తోందని కిషన్ రెడ్డి(Kishan Reddy) జనవరి 15వ తేదీన రాసిన లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ, దానికి సంబంధించిన వివరాలను కూడా ముఖ్యమంత్రి తన లేఖలో తెలియజేశారు.
కమిటీ కూర్పునకు సంబంధించిన వివరాలను ఇప్పటికే కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. మెట్రో రైల్ ఫేజ్-II మంజూరు కోసం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫేజ్-II ప్రాజెక్టును తన పలుకుబడిని ఉపయోగించి వీలైనంత తొందరగా ఆమోదింపజేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి కోరారు.






