- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయం లాభసాటి కావడమే మా లక్ష్యం.. రవీంద్ర భారతి ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ స్పష్టీకరణ
రైతన్నలకు సీఎం రేవంత్ ఉగాది కానుక! మార్చి 22 నుంచి రైతు భరోసా నిధులు జమ. ఈ ఏడాదిని 'రైతునామ సంవత్సరం'గా ప్రకటించిన ముఖ్యమంత్రి.

దిశ, వెబ్ డెస్క్: ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) హైదరాబాద్ రవీంద్రభారతి (Ravindra Bharati)లో నిర్వహిస్తున్న శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో (Ugadi celebrations) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం అని, ఈ ఉగాది వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగానికి గొప్ప పండుగగా అభివర్ణించారు. అలాగే రైతులకు లాభాలు సంపాదించి పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని రైలులు బాగున్నప్పుడు, రైతుల పంటలు లాభాలు సాధించినప్పుడే రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అలాగే రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చి రైతులకు కష్టాలను తీర్చి, సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను అనుభవించే విధంగా చర్యలు తీసుకున్నామని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణం లో పాల్గొన్న వివిధ ప్రాంతాలకు చెందిన అర్చకులను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించారు.






