- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క ఓటు కూడా చీలొద్దు: CM రేవంత్
మున్సిపల్ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. మంత్రులు అందరూ జిల్లా్లకు వెళ్లాలని చెప్పారు. వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలని అన్నారు. రోజువారీ రిపోర్ట్ తనకు అందించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించాలని అన్నారు. అందరూ సమిష్టిగా పనిచేయాలని.. ఒక్క ఓటు కూడా చీలకుండా జాగ్రత్త పడాలని అన్నారు. పాత, కొత్త నేతలు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జులదే గెలుపు బాధ్యత అని అన్నారు. ఒక్కటి మిస్సవ్వకుండా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పారు.
కాగా, మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి సీఎ రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటనలు చేపట్టనున్నారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో సీఎం పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం పర్యటనలు, సభల్లో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో, 9న మెదక్‌లో ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.






