పోలీస్ అకాడమీ యాన్యువల్ మ్యాగజైన్ –2025 ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

by Malleboina Mahesh |

మహిళా పోలీసుల సాధికారత కోసం పోలీస్ అకాడమీ వార్షిక మ్యాగజైన్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మహిళా ఎస్హెచ్ఓల నియామకం, ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పనపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

పోలీస్ అకాడమీ యాన్యువల్ మ్యాగజైన్ –2025 ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పోలీసింగ్, శాంతిభద్రతలు, దర్యాప్తు, ట్రాఫిక్ నిర్వహణ బందోబస్తు విధుల్లో మహిళా సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉమెన్ కాన్ఫరెన్స్ ఫర్ పోలీస్, పోలీస్ అకాడమీ యాన్యువల్ మ్యాగజైన్ –2025 సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ తమిళనాడు వంటి వివిధ రాష్ట్రాల్లో మహిళల నియామకం,శిక్షణలపై ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర పోలీసింగ్‌లో మహిళల భాగస్వామ్యం మరింత బలోపేతం చేయడానికి తగిన చర్యలు చెపట్టాలని అధికారులను ఆదేశించారు.

కార్యాచరణపై నివేదికను సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఆర్‌బివిఆర్ఆర్ టిజిపిఎ ఆధ్వర్యంలో తెలంగాణ వుమెన్ కాన్ఫరెన్స్ ఫర్ పోలీస్ సదస్సును నిర్వహించడం, చర్చలు, సిఫార్సులను పుస్తక రూపంలో విడుదల చేయడాన్ని సీఎం అభినందించారు. పోలీసింగ్‌లో మహిళలను బలోపేతం చేయడానికి ఐదు ముఖ్యమైన ప్రాధాన్యతలను పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ వివరించారు. ప్రత్యేక విశ్రాంతి గదులు, క్రెచ్ సౌకర్యాలు, బందోబస్తు సమయంలో మొబైల్ టాయిలెట్ యూనిట్లు, మహిళల పెట్రోలింగ్‌ను పెంచడానికి తగిన సంఖ్యలో స్కూటర్లను అందించడం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదల చేయాలని తెలిపారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం, లా అండ్ ఆర్డర్, బందోబస్త్‌లలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని వివరించారు. యూనిఫాం కంఫర్ట్ మార్గదర్శకాలను పరిశీలించాలని, జండర్ ఈక్వేషన్ కూడా పరిగణించాలని తెలిపారు. ఈ అంశాల కార్యాచరణ కోసం డీజీపీ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో , ఐపిఎస్ అధికారులు శిఖా గోయల్ , స్వాతి లక్రా , చారు సిన్హా, విజయ్ కుమార్ , శ్వేత, పాల్గొన్నారు.

Next Story