- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీని కలవడానికి ఆలోచించను.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
నన్ను ప్రతిసారి నరేంద్ర మోడీతో ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించే వారికి సూటిగా చెబుతున్నా.. మోడీతో బరాబర్ కలుస్తా.

దిశ, నిర్మల్ ప్రతినిధి: నన్ను ప్రతిసారి నరేంద్ర మోడీతో ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించే వారికి సూటిగా చెబుతున్నా.. మోడీతో బరాబర్ కలుస్తా..! తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా..! చిన్న వయస్సులోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోను. ఎర్రబస్సు రాని వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ బస్సును తీసుకొస్తున్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణహిత ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతా. ఇలాంటి పనులు ముందుకు సాగాలంటే కేంద్రంలో ఉన్న ప్రధాని, కేంద్ర మంత్రులని తప్పనిసరి కలవాల్సిందే. దీన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. నేను అసలు ఇలాంటివి అసలే పట్టించుకోను. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పేదల సంక్షేమం మాత్రమే నాకు ముఖ్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రసంగించారు. కేంద్రంతో దోస్తీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ విషయంలో జిల్లాల వారీగా డిమాండ్లు ఉన్నప్పటికీ సరస్వతి అమ్మవారి క్షేత్రం బాసరలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. పదివేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు.. పాలమూరుతో సమానంగా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగంతో పాటు పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు ఇందుకు ఆదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాలు సేకరించే బాధ్యతను జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నా సొంత జిల్లా పాలమూరుతో సమానంగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా తొలి పర్యటన నిర్మల్‌లోనే జరిగిందని.. ఎన్నికల శంఖారావానికి సంబంధించి తొలి బహిరంగ సభ ఇంద్రవెల్లిలో నిర్వహించాలని అందుకే తనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే అభిమానం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తా..
గత పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి న్యాయం జరిగేదని ఆయన పేర్కొన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసి వదిలివేసిన ఆ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ విషయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని సూచించారు ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






