- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి
by Muthe.Rajitha |
ఎప్పుడూ మంత్రులు, అధికారుల సమావేశాలతో బిజీ బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలో విద్యార్థిగా మారనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఎప్పుడూ మంత్రులు, అధికారుల సమావేశాలతో బిజీ బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలో విద్యార్థిగా మారనున్నారు. ప్రఖ్యాత యూఎస్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఓ ప్రోగ్రాంలో స్టూడెంట్ అవతారం ఎత్తడమే కాదు, బుద్దిగా హోంవర్కులు కూడా చేయనున్నారు సీఎం. అక్కడి కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో "లీడర్ షిప్ ఫర్ ది 21st సెంచరీ"ప్రోగ్రాంకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 25 నుంచి 30 వరకు హాజరవుతారని సీఎంవో అధికారులు పేర్కొన్నారు. మొత్తం 20 దేశాల నుంచి కీలక నేతలు ఈ క్లాసులకు హాజరుకానున్నారు.
క్లాసులు వినడమే కాదు.. పలు అంశాలపై అసైన్మెంట్స్, హోంవర్క్స్ కూడా చేయనున్నారు. అంతేకాదు.. సీఎం రేవంత్ కు ఓ ప్రత్యేకత కూడా ఉంది. భారత్ నుంచి సీఎం హోదాలో హాజరవుతున్న తొలి వ్యక్తి రేవంత్ రెడ్డే కావడం విశేషం.
Next Story






