- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె సేవలు అభినందనీయం
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాకు డీఈఓగా విజయ కుమారి చేసిన సేవలు అభినందనీయమని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కొనియాడాయి.

దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాకు డీఈఓగా విజయ కుమారి చేసిన సేవలు అభినందనీయమని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కొనియాడాయి. జిల్లా నుంచి బదిలీ అయిన డీఈఓ విజయ కుమారికి గురువారం కలెక్టరేట్ లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ( టీ.జీ.ఈ.జే.ఏ.సీ ) లు వీడ్కోలు అభినందన సమావేశాన్ని నిర్వహించాయి. ఆమె జిల్లాకు చేసిన సేవలను పేర్కొంటూ, శాలువా కప్పి, మెమెంటో అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రవి ప్రకాశ్ మాట్లాడుతూ.. కోవిడ్ లాక్ డౌన్ సమయంలోనూ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించి, విద్యార్థులకు సేవలు అందించారని అభినందించారు.
ఈ సందర్భంగా ఆమెకు జాతీయ స్థాయి అవార్డ్ కూడా దక్కిన విషయాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. అలాగే, జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులను సమన్వయం చేసుకుంటూ విద్యా వ్యవస్థను ముందుకు సాగించారన్నారు. చివరగా, డీఈవో విజయ కుమారి మాట్లాడుతూ, జిల్లాలో తనకు సహకరించిన ఉపాద్యాయ, ఉద్యోగ, సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పీ.ఆర్.టీ.యు - టి.ఎస్ జిల్లా అధ్యక్షులు రామేశ్వర్ గౌడ్, టీ.ఎస్ - యూటీఎఫ్ అధ్యక్షులు కె.జయ సింహ రెడ్డి, ఎస్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి విఠల్, టి.ఎస్.జి.హెచ్.ఎం.ఎ అధ్యక్షులు రాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి, పి.ఆర్.టి.యు - టి.ఎస్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి, యు.టి.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భరత్, కార్తీక్ పాల్గొన్నారు.






