- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి : సీఎం రేవంత్ రెడ్డి
నీట్ (NEET) యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : నీట్ (NEET) యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్రం ప్రదర్శిస్తున్న చేతగానితనం వల్లే వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం 'డెమానిటైజేషన్' చేసిందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఒకసారి పరీక్ష రాసిన తర్వాత మళ్లీ రద్దు చేయడం వల్ల విద్యార్థులు విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
పరిపాలనలో వైఫల్యాలు, అవినీతి, అక్రమాల్లో బీజేపీ, గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రెండూ ఒకే రకమని రేవంత్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో కూడా అనేకసార్లు పేపర్లు లీక్ అయి నిరుద్యోగుల, విద్యార్థుల జీవితాలు అంధకారమయ్యాయని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల శాపానికి గురైన ఏ రాజకీయ పార్టీ కూడా బాగుపడలేదని, బీఆర్ఎస్ తరహాలోనే బీజేపీ పతనం కూడా ఎంతో దూరంలో లేదని ఆయన జోస్యం చెప్పారు.
జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని ప్రధాన పరీక్షల విశ్వసనీయతపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటి పారదర్శకతను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.






