- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీంకోర్టులో లాయర్‌గా సీఎం మమతా బెనర్జీ వాదనలు.. కీలక ఆదేశాలు జారీ
మొట్ట మొదటి సారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లాయర్‌గా మారి కోర్టులో వాదించారు. SIR, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు (Supreme Court) తో పాటు దేశ చరిత్రలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. మొట్ట మొదటి సారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లాయర్‌గా మారి కోర్టులో వాదించారు. SIR, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ క్రమంలో ఏకంగా సీఎం తన రాజకీయ పోరాటం కోసం న్యాయవాది అవతారమెత్తి వాదించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా ఆమె ఆమె తన వాదనలను వినిపించారు.
సీఎం మమతా వాదనలు
ఎస్ఐఆర్ అంశంపై ఆమె సుప్రీం కోర్టులో మాట్లాడుతూ.. తనను తాను ఒక "బాండెడ్ లేబర్" (వెట్టి చాకిరీ చేసే వ్యక్తి)గా అభివర్ణించుకున్నారు. అలాగే తాను కేవలం తన రాజకీయ పార్టీ కోసం మాత్రమే కాకుండా, ప్రజలందరి ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని పేర్కొన్నారు. ఎస్ఐఆర్‌తో ఓటరు జాబితా నుండి లక్షలాది మంది పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని, బతికున్న వారిని కూడా 'చనిపోయినట్టు గా ప్రకటించారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి సుమారు 8,300 మంది మైక్రో అబ్జర్వర్లను తీసుకువచ్చి, సరైన వెరిఫికేషన్ లేకుండా పేర్లను తొలగిస్తున్నారని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ.. అది ప్రజల పక్షాన కాకుండా సోషల్ మీడియా ఆదేశాల మేరకే పనిచేస్తున్నట్లుగా ఉందని, దానిని "వాట్సాప్ కమిషన్" అని ఆమె విమర్శించారు. న్యాయం మూసివున్న తలుపుల వెనుక ఏడుస్తోందిని, తాము ఎక్కడా న్యాయం పొందడం లేదనే భావన కలుగుతోందని ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఆరు లేఖలు రాశానని ఆమె కోర్టుకు తెలిపారు.
సుప్రీంకోర్టు స్పందన..
సీఎం మమతా బెనర్జీ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే ఈ ప్రక్రియలో రాష్ట్ర అధికారుల పాత్ర ఉండాలని భావించిన కోర్టు, ఓటరు వెరిఫికేషన్ కోసం అందుబాటులో ఉంచగల గ్రూప్-బి (క్లాస్-2) అధికారుల జాబితాను వచ్చే సోమవారం లోపు సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఇదే అంశంపై ఇప్పటికే ఈసీ దాఖలు చేసిన పిటిషన్లు ఉండగా.. వాటిని కూడా అనుబంధ పిటిషన్లతో కలిపి ఈ కేసును వచ్చే సోమవారం (ఫిబ్రవరి 9) మళ్లీ విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.






