- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
CM KCR: అఖిలేష్‌తో కేసీఆర్ భేటీ.. ఆసక్తికరంగా మారిన కీలక పరిణామం

దిశ, వెబ్‌డెస్క్: CM KCR meets Akhilesh Yadav in Delhi Tour| ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. శుక్రవారం ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ తో పాటు అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ను కలిశారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్... పలువురు రాజకీయ వేత్తలు, ఆయా సంఘాలకు చెందిన ప్రముఖులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని, ఈ అంశంలో అవసరం అయితే న్యాయపోరాటం చేసేలా సంబంధిత నిపుణులతో కేసీఆర్ సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ ఎజెండా రూపొందిస్తానని చెబుతున్న కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఇంకా టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో వీరి మధ్య ఏదైనా చర్చ జరిగిందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇరువురి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: