విశాఖలో సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు.. పర్యావరణ పరిరక్షణపై కీలక పిలుపు

by Malleboina Mahesh |

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో సైకిల్ సవారీ చేసిన సీఎం చంద్రబాబు. కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ సైకిళ్లు వాడాలని, మొక్కలు నాటాలని పిలుపు.

విశాఖలో సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు.. పర్యావరణ పరిరక్షణపై కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవం (Environment Day) సందర్భంగా ఆయన నగరవాసులను సైకిల్ తొక్కుతూ ఆకట్టుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. స్వయంగా సైకిల్ సవారీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే సీఎం.. పర్యావరణ పరిరక్షణ కోసం సామాన్యుడిలా సైకిల్‌పై తిరుగుతూ పచ్చదనం పెంచడం, కాలుష్య నియంత్రణ ప్రాధాన్యత పై ప్రజల్లో అవగాహన కల్పించారు.

ప్రకృతిని కాపాడాలని సీఎం పిలుపు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా హానికరమైన కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు వీలైనంత వరకు నిత్య జీవితంలో సైకిళ్లను వాడాలని ఆయన సూచించారు. ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి, దాన్ని సంరక్షించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం సైకిల్ తొక్కుతూ ఇచ్చిన ఈ పర్యావరణ సందేశం సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు వైరల్‌గా మారింది.

Next Story