- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్విడియా ఉపాధ్యక్షురాలుతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్విడియా (NVIDIA) గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టా రెడ్మెండ్ (Calista Redmond)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎకోసిస్టమ్‌ను నిర్మించడం, యువతకు నైపుణ్య శిక్షణ, స్టార్టప్‌లను ప్రోత్సహించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ రాష్ట్రంలోని యువతకు గ్లోబల్ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎన్విడియా ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ
ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేలా ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల (MoU) అమలుపై స్పష్టతనిచ్చారు. కేవలం విద్య మాత్రమే కాకుండా, ఏపీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC), హార్డ్‌వేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసే అంశాలపై కూడా ఎన్విడియా సానుకూలంగా స్పందించింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం వహించి, కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తామని కాలిస్టా రెడ్మెండ్ సీఎం చంద్రబాబుకి వివరించారు.
READ MORE .....






