- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దావోస్ లో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
వ్యూహాత్మక భాగస్వామ్యాలను పటిష్టం చేసుకోవడంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) స్విట్జర్లాండ్ లోని దావోస్ (Davos) లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో (WEF) భాగంగా ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గత రెండు రోజులుగా వివిధ దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో జరిగిన చర్చల పురోగతిని ఆయన ఈ సమావేశంలో విశ్లేషించారు. అంతర్జాతీయ ప్రతినిధులు రాష్ట్రంలోని కృత్రిమ మేధ (AI), గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలపై కనబరుస్తున్న ఆసక్తిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కుదుర్చుకున్న ప్రాథమిక ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. విదేశీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుర్తించిన ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు ఫాలో-అప్ చేయాలని, పెట్టుబడుల సాధనలో ఏమాత్రం జాప్యం జరగకుండా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిని గ్లోబల్ సిటీగా, విశాఖను టెక్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రపంచ శ్రేణి సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను పటిష్టం చేసుకోవాలని ఆయన ఈ సమీక్షలో స్పష్టం చేశారు.
READ MORE .....






