మూసీ నది ప్రక్షాళనతో తెలంగాణ ప్రఖ్యాతి పెరుగుతుంది: చనగాని దయాకర్

by Malleboina Mahesh |

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ తిప్పికొట్టారు. బాధితుల పేరుతో రాజకీయం చేయకుండా, నగరాభివృద్ధికి సహకరించాలని బీఆర్ఎస్, బీజేపీలకు సూచించారు.

మూసీ నది ప్రక్షాళనతో తెలంగాణ ప్రఖ్యాతి పెరుగుతుంది: చనగాని దయాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూసీ బాధితులతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, మూసీ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలకు గాంధీ విగ్రహం పెట్టడాన్ని మింగుడు పడటం లేదని, హైదరాబాద్ లోని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నది 55 కి.మీ విస్తీర్ణాన్ని శుభ్రపరచడం, కారిడార్ మార్చాడాన్ని స్వాగతించాలన్నారు. మూసీ నది ప్రక్షాళనతో తెలంగాణ ప్రఖ్యాతి పెరుగుతుందని, మూసీ అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో ప్రజలు పొల్యూషన్ లేని నగర నిర్మాణం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని చనగాని దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో బాధితులతో ఎలా వ్యవహరించారో గతంలోనే చూసామని, బాధితుల పక్షాన ప్రతిపక్షాలు హుందాగా వ్వవరించాలి. కడుపులో విషం పెట్టుకొని ఆ పార్టీలు ఉద్దేశపూర్వకంగా ప్రవరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిత్యం వరదలతో, మురికి కంపుతో అల్లాడుతున్న ప్రజల బాధలు గత పాలకులు పట్టించుకోలేదని, వెన్నెముక లేని ప్రతిపక్షాలు తెలంగాణలో ఉండడం మన దౌర్భాగ్యమని చనగాని దయాకర్ మండిపడ్డారు.

Next Story