ఏపీలో రూ.1200 కోట్లతో క్లీన్ మాక్స్ సోలార్ పార్క్

by Muthe.Rajitha |

ఏపీలో రూ.1200 కోట్లతో సోలార్ పార్క్ ఏర్పాటు చేయడానికి క్లీన్ మాక్స్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది.

ఏపీలో రూ.1200 కోట్లతో క్లీన్ మాక్స్ సోలార్ పార్క్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో రూ.1200 కోట్లతో 200 మెగావాట్ల సోలార్ పార్క్ అభివృద్ధి చేయడానికి క్లీన్ మాక్స్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితమైన స్థలం ఇంకా ప్రకటించకపోయినా, సొంత నిర్మాణం, నిర్వహణ పద్దతిలో(BOO) ఈ పార్క్ ను అభివృద్ధి చేయనున్నట్టు సమాచారం. కాగా ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ప్రధానంగా కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్(C&I) వినియోగదారులకు దీర్ఘకాలిక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (PPAs) ద్వారా సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం క్లీన్ మాక్స్ దాదాపు 1.5 గిగావాట్ల ఆపరేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని(సోలార్ + విండ్) కలిగి ఉండగా.. 2027 నాటికి 3 గిగావాట్లకు చేరుకోవడమే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ 18 నుండి 24 నెలల్లో దశలవారీగా పూర్తి చేయనున్నారు. భారతదేశంలో రూఫ్‌టాప్, గ్రౌండ్-మౌంట్ సోలార్ రంగంలో టాప్ ఉన్న క్లీన్ మాక్స్.. గూగుల్, అమెజాన, మైక్రోసాఫ్ట్, వాల్ మార్ట్ వంటి గ్లోబల్ దిగ్గజాలకు గ్రీన్ పవర్ సరఫరా చేస్తోంది.

కాగా త్వరలోనే ఈ సంస్థ IPO కి వెళ్లనుంది. ఏపీలో పెట్టుబడి పెట్టనున్న రూ.1,200 కోట్ల భారీ పెట్టుబడి భారత భవిష్యత్తు సోలార్ రంగంపై సంస్థకు ఉన్న గట్టి నమ్మకాన్ని తెలియజేస్తోంది. IPOకువెళ్లక ముందే సంస్థ విస్తరణను చేపట్టడం ద్వారా పెట్టుబడిదారుల ముందు బలమైన గ్రోత్ స్టోరీని ప్రదర్శించాలనే వ్యూహంతో క్లీన్ మాక్స్ ముందుకు సాగుతోంది. మొత్తంగా చూసినట్లయితే.. క్లీన్ మాక్స్ సోలార్ ప్రాజెక్ట్ సంస్థ పబ్లిక్ ఇష్యూ ప్రక్రియకు ఒక ముఖ్యమైన బూస్ట్‌గా నిలిచే అవకాశముంది.

Next Story