- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: కాంగ్రెస్ సూపర్ ప్లాన్.. మున్సిపోల్స్ షెడ్యూల్ వచ్చేలోపే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్!
అధికార కాంగ్రెస్‌లో వలస ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసి ఓడిన లీడర్ల మధ్య వర్గపోరు రోజురోజుకూ పెరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార కాంగ్రెస్‌లో వలస ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసి ఓడిన లీడర్ల మధ్య వర్గపోరు రోజురోజుకూ పెరుగుతున్నది. నియోజకవర్గంలో పట్టుకోసం ఇరువర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఇరువర్గాలు తమ అనుచరులను బరిలోకి దింపేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు ప్రయోజనం కలిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు గుర్తించి అలర్ట్ చేశాయి. అందుకని ఇరువురి మధ్య సయోధ్య కుదుర్చేందుకు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. త్వరలో అటు ఎమ్మెల్యేలు ఇటు కంటెస్టెడ్ లీడర్ల అభిప్రాయాలు విని పరిష్కారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
ఆ ఐదు నియోజకవర్గాల్లో సమస్యలు..
త్వరలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందనే వార్తల నేపథ్యంలో అటు కాంగ్రెలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇటు కంటెస్టెడ్ లీడర్ల వర్గాలు యాక్టివ్ అయ్యాయి. అన్ని వార్డుల టికెట్లు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే రెబల్‌గా పోటీ చేసి తమ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఎవరిని ఎక్కడినుంచి పోటీకి దింపాలో జాబితా కూడా తయారు చేస్తున్నారు. ఒకవేళ ఇరువురు తమ అనుచరులను బరిలోకి దింపితే ఆ మున్సిపాలిటీల్లో ప్రత్యర్థి పార్టీలు గెలిచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన నిఘావర్గాలు ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి. దీంతో ఇరువురితో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా మంత్రులకు ఆయన బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులు ఇరు వర్గాలతో మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో నేరుగా పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇరువురితో మాట్లాడి పరిష్కారం చూపాలని యోచనలో మీనాక్షి ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎవరి డిమాండ్ వారిదే..
వలస ఎమ్మెల్యేల అనుచరుల హడావుడితో కంటెస్టెడ్ లీడర్ల ఫాలోవర్స్ ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రతి విషయంలో ఎమ్మెల్యేకు, ఆయనతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లకు ప్రయారిటీ ఇస్తే తమ భవిష్యత్ ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. అందుకని మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తమ అనుచరులను బరిలోకి దింపి తమ సత్తా ఏంటో చూపాలని కంటెస్టెడ్ లీడర్లు నిర్ణయానికి వచ్చారు. అయితే, వలస ఎమ్మెల్యేల డిమాండ్ మరో తీరుగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకోకపోతే తన వెంట పార్టీలోకి వచ్చిన లీడర్లు తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత తాము రాజకీయంగా నష్టపోయామని.. కనీసం మున్సిపల్ ఎన్నికల్లో తమ అనుచరులకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని వలస ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.





