- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్‌లో ఉద్రిక్తం.. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శనలో ఘర్షణ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్‌లో శుక్రవారం ఘర్షణ జరిగింది.

X
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్‌లో శుక్రవారం ఘర్షణ జరిగింది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శిస్తుండగా మధ్యలో ఓ వర్గానికి చెందిన కొందరు యువకులు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. మరో వర్గానికి చెందిన యువకులు భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఒకరిపై ఒకరు ప్రతి దాడులకు దిగినట్లు సమాచారం. థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని రెండు వర్గాలకు చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






