'సలార్' అప్‌డేట్.. అమ్మడి పాత్ర అదే..??

by Dishafeatures2 |
సలార్ అప్‌డేట్.. అమ్మడి పాత్ర అదే..??
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల లిస్ట్‌లో 'సలార్' పక్కా టాప్‌లో ఉంటుంది. ఈ మూవీ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో ఇప్పటికే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కొత్తగా పక్కా యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన క్రాక్ భామ శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. అదే ఈ సినిమాలో శ్రుతి పాత్ర గురించి. పొలిటికల్, మాఫియా, యాక్షన్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ మూవీలో శ్రుతి ఓ జర్నలిస్ట్‌గా కనిపించనుందట. హీరో జీవితం గురించి తెలుకునేందుక శ్రుతి ప్రయత్నిస్తుంటుందని, ఈ క్రమంలోనే హీరోతో ప్రేమలో పడుతుందని వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా ఆ తర్వాత హీరో చేసే క్రైమ్‌లోనూ భాగస్వామి అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర లాంగ్ లెంత్ ఉండనుందని, శ్రుతి స్టంట్స్ కూడా చేయనుందని మూవీ టీం నుంచి వినిపిస్తోంది. ఈ సినిమాలో శ్రుతి యాక్షన్ సీక్వెన్స్‌లో నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపిస్తోందని, ఈ సినిమా అమ్మడికి బెస్ట్ కంబ్యాక్ అవుతుందని సమాచారం. ఇప్పటికే శ్రుతితో ఆంధ్ర, కర్ణాటక ప్రదేశాల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. మరి ఈ మూవీలో శ్రుతి మళ్లీ తన స్టార్ హీరోయిన్ హోదా అందుకుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ మూవీలో అమ్మడి పాత్రపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి త్వరలో ఏమైనా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందేమో చూడాలి.


Next Story

Most Viewed