తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన

by Malleboina Mahesh |   (  Updated:2026-04-05 09:15:08  IST  )

హైదరాబాద్‌లో హైకోర్టు జోన్-II భవనానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన! సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బుద్వేల్‌లో నూతన నిర్మాణ పనుల ప్రారంభం.

తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఆదివారం మరో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్‌లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్న హైకోర్టు జోన్-ఇఇ (High Court Zone-II) భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన పలువురు ప్రముఖ న్యాయమూర్తులు పాల్గొన్నారు.

సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో కూడిన కోర్టు గదులు, డిజిటల్ లైబ్రరీలు, పరిపాలనా విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండో దశలో న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం వారసత్వ కట్టడంగా ఉన్నందున, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బుద్వేల్‌లో ఈ కొత్త కాంప్లెక్స్‌ను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న ఈ జోన్-II భవనం ద్వారా న్యాయ సేవల వేగం మరింత పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.

న్యాయవ్యవస్థ బలోపేతం: జస్టిస్ సూర్యకాంత్

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా, న్యాయపరమైన అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు అవసరమైన భవనాలు, సాంకేతికతను అందించడం ద్వారా సామాన్యులకు త్వరితగతిన న్యాయం అందుతుందని అన్నారు. కొత్త హైకోర్టు ప్రాంగణం కోసం అత్యంత విలువైన భూమిని కేటాయించినందుకు, నిర్మాణ పనులకు పూర్తి సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ సూర్యకాంత్ అభినందించారు.

హైకోర్టు అన్ని వర్గాల ప్రజలకు దేవాలయం లాంటిది: సీఎం రేవంత్ రెడ్డి

Next Story