- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు : పౌరసరపరాల శాఖ
రాష్ట్రంలో రబీ సీజన్‌లో వరి ధాన్యం 30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్ల పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రబీ సీజన్‌లో వరి ధాన్యం 30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్ల పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కనీస మద్దతు ధర కింద రూ. 4,520 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కొనుగోలు చేసిన ధాన్యంలో 9 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కాగా, 21 లక్షల మెట్రిక్ టన్నుల మేర దొడ్డురకం ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. ధాన్యం నిల్వల సమస్య తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ప్రతిరోజూ కొత్త ధాన్యం తూకం వేసి తరలించేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాప్యం లేకుండా నేరుగా కేంద్రాల నుండి మిల్లులకు తరలించడానికి లారీలు, ట్రాక్టర్లు, డీసీఎంలతో కూడిన సుమారు 11,500 రవాణా వాహనాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియ పర్యవేక్షించడానికి, మిల్లుల వద్ద కూడా ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు, గోదాములలో ధాన్యం నిర్వహణ ఛార్జీలను క్వింటాల్‌కు రూ. 17లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఖరీఫ్ సీజన్ కు 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను కేటాయింపు జరిగిందన్నారు. రైతులు తమకు ఏవైనా సందేహాలు, సమస్యలతో పాటు సహాయం కావాలంటే పౌరసరఫరాల శాఖకు చెందిన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1967 ను సంప్రదించగలరని కోరారు.






