- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ విమానాశ్రయాల భద్రతలో సరికొత్త విప్లవం
భారతదేశంలోని అన్ని విమానాశ్రయాల నిఘా నెట్‌వర్క్‌ను అనుసంధానిస్తూ ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ అత్యాధునిక 'డేటా ఫ్యూజన్ సెంటర్' ఏర్పాటు చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో విమానాశ్రయాల (Airports) భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యాధునిక 'డేటా ఫ్యూజన్ సెంటర్' (Data Fusion Centre - DFC)ను ఏర్పాటు చేసేందుకు సీఐఎస్ఎఫ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సెంటర్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల నిఘా నెట్‌వర్క్‌లు, సీసీటీవీ (CCTV) ఫీడ్‌లను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి అనుసంధానించనున్నారు.
భద్రతా సంస్థలకు లభించే సమాచార మార్పిడిని వేగవంతం చేయడం, ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు తక్షణమే స్పందించేలా ఒక సెంట్రలైజ్డ్ వ్యవస్థను రూపొందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం విమానాశ్రయాల వద్ద ఉన్న విడివిడి నిఘా వ్యవస్థల స్థానంలో, ఈ డేటా ఫ్యూజన్ సెంటర్ ద్వారా ఒకే కేంద్రం నుండి నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్, డేటా ఇంటిగ్రేషన్ టూల్స్ సహాయంతో అనుమానాస్పద కదలికలను ముందే గుర్తించేలా ఈ కేంద్రానికి అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను సమకూర్చుకోనున్నారు. మొదటి దశలో భాగంగా మెట్రో నగరాల్లోని ప్రధాన విమానాశ్రయాలను దీనికి అనుసంధానించి, ఆ తర్వాత దేశంలోని ఇతర విమానాశ్రయాలకు విస్తరించనున్నట్లు తెలుస్తుంది.






