పోలీసు క్రీడల్లో సీఐ చంద్రబాబు ప్రతిభ

by Batti.Sumithra |

5వ తెలంగాణ రాష్ట్ర పోలీసు క్రీడా పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు ప్రతిభ కనబరిచి కరాటే విభాగంలో కాంస్య పతకం సాధించారు.

పోలీసు క్రీడల్లో సీఐ చంద్రబాబు ప్రతిభ
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : 5వ తెలంగాణ రాష్ట్ర పోలీసు క్రీడా పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు ప్రతిభ కనబరిచి కరాటే విభాగంలో కాంస్య పతకం సాధించారు. సరోజినీదేవి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీల్లో ఈ ఘనతను అందుకున్నారు. ఈ సందర్భంగా సీఐ చంద్రబాబును యాదాద్రి జోన్ డీఐజీ జోయల్ డేవిస్, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని వారు కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు భువనగిరి టౌన్ ఇన్‌స్పెక్టర్ రమేష్, భువనగిరి రూరల్ ఎస్ హెచ్ వో అనిల్ కుమార్, ఎస్ఐలు లక్ష్మీ నర్సయ్య, వెంకటేశ్వర్లు, శివశంకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది సీఐ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story