- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్.. రాయల్‌గా 'భోళాశంకర్' ఫస్ట్ లుక్

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో స్పీడ్ పెంచేశాడు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చిరు 'భోళాశంకర్' సెట్స్‌లో దుమ్ముదులిపేస్తున్నాడు. అయితే తాజాగా మూవీ మేకర్స్ ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఇచ్చారు. చెప్పినట్లుగానే 'భోళాశంకర్' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది. ఇక పోస్టర్ విషయానికొస్తే ఇందులో చిరు మెగా రాయల్‌గా కనిపిస్తున్నాడు. ఈ మోషన్ పోస్టర్‌లో కారు ముందు కుర్చొని మాస్ కమ్ రాయల్ లుక్స్ అదరగొట్టాడు. అంతేకాకుండా ఈ పోస్టర్‌లో చిరు డైనమిక్ లుక్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అన్నింటికన్నా ఎక్కువగా చిరు చేతిలో ఉన్న త్రిశూళం చెయిన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహాశివరాత్రి స్పెషల్‌గా వచ్చిన ఈ పోస్టర్‌లో మూవీలోని హీరోకి దేవుడి పట్ల ఉండే భక్తిని తెలుపుతోంది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి పెంచింది. మరి సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.






