చిరు అభిమానులకు పండగే.. వరుస సినిమాలకు ప్లాన్..?

by Dishafeatures2 |
చిరు అభిమానులకు పండగే..  వరుస సినిమాలకు ప్లాన్..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో యంగ్ హీరోలు సైతం సినిమాకి సినిమాకి మధ్య భారీ గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకే సారి 5 సినిమాలు సెట్స్‌పైకి తీసుకెళ్లి అరుదైన ఘనత కూడా తన పేరిట రాసుకున్నాడు. అయితే ఇదే ఊపును కనుక చిరు కంటిన్యూ చేస్తే త్వరలో మెగా మానియా స్టార్ట్ అవ్వడం పక్కా. రానున్న 9 నెలల్లో మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు 3 సినిమాలు రిలీజ్‌కు రెడీ కానున్నాయి. ఏప్రిల్ 29న 'ఆచార్య' విడుదలవుతుండగా ఆ తర్వాత 'భోళాశంకర్' మూవీతో అలరించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.

'భోళాశంకర్'ను డైరెక్టర్ మెహర్ రమేష్ దసరా సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత కొన్ని నెలల గ్యాప్‌లోనే చిరు 'గాడ్ ఫాదర్'గా దర్శనమిచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే 'గాడ్ ఫాదర్' మూవీ 2023 సంక్రాంతి బరిలో నిలబడే అవకాశం ఉంది. వీటితో పాటుగా చిరు మరో రెండు సినిమాలను బాబి, వెంకీ కుడుములతో ప్లాన్ చేస్తున్నాడు. మరి అవెప్పుడు విడుదలవుతాయో చూడాలి. అంతేకాకుండా చిరు అనుకున్నట్లు మెగా మానియాను సృష్టిస్తాడో లేదో చూడాలి.



Next Story

Most Viewed