- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరిజిత్ సింగ్ రిటైర్మెంట్‌పై చిన్మయి షాకింగ్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
బాలీవుడ్ మెలోడీ కింగ్ అరిజిత్ సింగ్ (Arijit Singh)ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ మెలోడీ కింగ్ అరిజిత్ సింగ్ (Arijit Singh)ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటో అని నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, అరిజిత్ సింగ్‌తో కలిసి 'మాస్ట్ మగన్', 'సూయీన్ సి' వంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ చిన్మయి (Chinmayi)ట్విట్టర్ ద్వారా స్పందించింది. అరిజిత్‌తో తనకున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆయన వ్యక్తిత్వాన్ని పొగిడింది. ‘‘ప్రీతమ్ సార్ దగ్గర రికార్డింగ్ చేస్తున్నప్పుడు అరిజిత్‌ను మొదటిసారి కలిశాను. అప్పటికి ఆయన ఇంకా స్టార్ సింగర్ కాలేదు, 'తుమ్ హి హో' పాట కూడా రిలీజ్ అవ్వలేదు.
కానీ, తను ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో కూడా అరిజిత్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. ఆయన నా ఫేవరెట్ సింగర్ మాత్రమే కాదు.. నేను కలిసిన అత్యంత గొప్ప, ఆధ్యాత్మిక పరిణితి ఉన్న వ్యక్తులలో ఒకడు. అరిజిత్ ప్లాన్ ఎప్పుడూ దైవికంగానే ఉంటుంది’’ అని చిన్మయి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. పురుషుల గురించి నెగెటివ్‌గా చెప్తూ సంచలనం సృష్టించే చిన్మయి మంచిగా మాట్లాడటం ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఓ నెటిజన్ ‘‘మ్యామ్, ఒక పురుషుడి గురించి మీరు మంచి విషయాలు చెబుతుంటే చూడటానికి బాగుంది’’ అని కామెంట్ చేశాడు.
దానికి చిన్మయి స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసిన మగవాళ్లలో చాలా మంది మంచివారే. నా చుట్టూ ఉన్నవాళ్లలో ఎక్స్ (ట్విట్టర్) లో దూషించే మనుషులు లేకపోవడం నా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పురుషులు కేవలం దూషించడమే పనిగా పెట్టుకుంటారు’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం అరిజిత్ రిటైర్మెంట్‌తో పాటు చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి. కొందరు ఏం మారలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.






