ఏఆర్ రెహమాన్‌కు చిన్మయి మద్దతు.. అలా చెప్పడంలో తప్పులేదంటూ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-18 05:43:06  IST  )

ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఏఆర్ రెహమాన్‌కు చిన్మయి మద్దతు.. అలా చెప్పడంలో తప్పులేదంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన తీరు కొంతమందిని నొప్పించడంతో నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను అరగంట పాటు బ్రతిమాలినా రెహమాన్ 'వందేమాతరం' పాడటానికి నిరాకరించారని, ఆ ఘటన తనను ఎంతో బాధించిందని పోస్ట్ చేశారు. దీంతో రెహమాన్ దేశభక్తిని ప్రశ్నిస్తూ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది.

అయితే ఈ ఆరోపణలపై సింగర్ చిన్మయి శ్రీపాద గట్టిగా స్పందిస్తూ రెహమాన్‌కు మద్దతుగా నిలిచారు. గతేడాది నవంబర్ 23న పూణేలో జరిగిన కాన్సర్ట్‌లో రెహమాన్ అందరితో కలిసి వందేమాతరం ఆలపించారని, ఆయన ప్రతి కచేరీలోనూ 'మా తుజే సలామ్' తప్పనిసరిగా పాడుతారని చిన్మయి గుర్తు చేశారు. ఆ రోజు ఇంటర్వ్యూలో ఆయన గొంతు బాగుండకపోవడం వల్లనో లేదా మరేదైనా కారణం చేత పాడకపోయి ఉండొచ్చు కానీ, దాన్ని తప్పుగా చిత్రీకరించడం సరికాదని ఆమె హితవు పలికారు. అంతేకాకుండా పాడటానికి నిరాకరించడం తప్పు కాదని అన్నారు. మరోవైపు నటి మీరా చోప్రా కూడా స్పందిస్తూ రెహమాన్‌ను తన సోదరి ప్రియాంక చోప్రాతో పోలుస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని సమర్థించారు. ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

link

Read More..

నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఎఆర్ రెహమాన్

Next Story