- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఎఆర్ రెహమాన్
తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన వేళ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓ వీడియోను విడుదల చేశారు. భారతదేశం తనకు స్పూర్తి అని, భారత్ అన ఇల్లు మరియు టీచర్ అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన వేళ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓ వీడియోను విడుదల చేశారు. భారతదేశం తనకు స్పూర్తి అని, భారత్ అన ఇల్లు మరియు టీచర్ అని అన్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశం సంగీతానికి గౌరవం దగ్గడమేనని చెప్పారు. తాను ఎప్పుడూ బాధ పెట్టాలని అనుకోలేదన్నారు. తన నిజాయితీని గుర్తిస్తారని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు.
భారతీయుడిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అన్ని భాషలను గౌరవించే, భావప్రకటన స్వేచ్ఛ కలిగి ఉన్న దేశంలో ఉండటం అదృష్టం అన్నారు. ప్రస్తుతం తాను రామాయణం సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నానని చెప్పారు. ప్రతి ప్రయాణం తనను మరింత ధృడంగా తయారు చేసేందుకు ప్రేరేపిస్తాయని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో తమ మతం వల్లనే అవకాశాలు తక్కువ వచ్చాయేమో అంటూ ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. దీంతో ఆయనపై విమర్శలు రాగా క్లారిటీ ఇచ్చారు.
Read More..






