గొంతులో అన్నం ఇరుక్కొని చిన్నారి మృతి

by Muthe.Rajitha |

ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది.

గొంతులో అన్నం ఇరుక్కొని చిన్నారి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. గొంతులో అన్నం ఇరుక్కొని చిన్నారి మృతి చెందింది. జంగారెడ్డిగూడెంలో మార్కండేయపురం కాలనీకి చెందిన అభయ ఆంజనేయకుమార్, భానుశిరీష దంపతులకు రెండేళ్ల కుమార్తె జెస్సీదీవెన ఉంది. చిన్నారి ఎదుగుదల సరిగా లేకపోవడంతో ఆమెకు వైద్యం చేయిస్తున్నారు. శుక్రవారం తల్లి, నాయనమ్మ పనిమీద బయటికి వెళ్లగా, చిన్నారిని తండ్రి వద్ద వదిలారు. భోజనం సమయంలో తండ్రి ముద్దపప్పుతో కలిపిన అన్నాన్ని జెస్సీదీవెనకు తినిపించగా, ఆ అన్నం ముద్ద ఆమె గొంతులో ఇరుక్కొని ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

తీవ్రంగా కంగారుపడ్డ తండ్రి వెంటనే పొరుగువారి సహాయంతో సపర్యలు చేసినప్పటికీ.. చిన్నారి స్పృహ కోల్పోయింది. హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు అప్పటికే జెస్సి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్, ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు ఘటనాస్థలికి చేరుకొని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story