Chikoti Praveen: ట్వీట్‌పై క్లారిటీ ఇచ్చిన చికోటి ప్రవీణ్

by samatah |   (  Updated:2022-08-30 09:27:30  IST  )

Chikoti Praveen Gives Clarity On Twitter Message| క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ మంగళవారం మరోసారి ఈడీ ముందు హాజరయ్యారు. అధికారులు కోరిన వివరాలతో ఆయన ఈడీ కార్యాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందు ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు

Chikoti Praveen: ట్వీట్‌పై క్లారిటీ ఇచ్చిన చికోటి ప్రవీణ్
X

దిశ, వెబ్‌డెస్క్ : Chikoti Praveen Gives Clarity On Twitter Message| క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ మంగళవారం మరోసారి ఈడీ ముందు హాజరయ్యారు. అధికారులు కోరిన వివరాలతో ఆయన ఈడీ కార్యాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందు ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని స్పష్టం చేశారు. ఫేక్ అకౌంట్స్ పై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయని నిజాలేంటో త్వరలోనే తెలుస్తాయని చెప్పారు. తప్పుడు కథనాలను ప్రసారం చేయవద్దని అన్నారు.

అయితే చికోటీ ప్రవీణ్ పేరుతో సోషల్ మీడియా ఖాతాలను పోలీన స్క్రీషార్ట్ ఇమేజ్ లు వైరల్ గా మారాయి. ఇందులో 'తనను ఇరికించాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టను' ప్రవీణ్ చెప్పినట్లుగా రాసి ఉంది. దీంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అవి నావి కావని అవన్ని ఫేక్ అకౌంట్స్ అని చికోటి ప్రవీణ్ చెప్పారు. కాగా హవాలా కేసులో ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్, సంపత్, మాధవరెడ్డి లు రెండో రోజు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే చికోటి ప్రవీణ్ కు చెందిన ల్యాప్ టాప్స్ మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిల్లో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో చికోటికి ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: సీఎంను కూడా వదిలిపెట్టను.. సంచలనం రేపుతున్న చికోటి ప్రవీణ్ ట్వీట్?

Next Story