ట్యాక్సుల రూపంలో కేంద్రం భారీ దోపిడీ.. రూ.1 లక్ష వసూలు చేసిందంటూ.. ట్వీట్

by Disha Web Desk 12 |
ట్యాక్సుల రూపంలో కేంద్రం భారీ దోపిడీ.. రూ.1 లక్ష వసూలు చేసిందంటూ.. ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: వరుసగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. 8 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇంధన పన్నుల రూపంలో రూ.26,51,919 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో దాదాపు 26 కోట్ల కుటుంబాలు ఉన్నాయి అంటే ప్రతి కుటుంబం నుంచి కేంద్ర ప్రభుత్వం సగటున రూ. 1,00,000 ఇంధన పన్నుగా వసూలు చేసింది..!

ఇంత పెద్ద మొత్తంలో ఇంధన పన్ను చెల్లించినందుకు సగటు కుటుంబానికి ప్రతిఫలంగా ఏమి వచ్చిందని.. అని మీరే ప్రశ్నించుకోండి. మరింత సమాచారం కోసం 3-4-2022 నాటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని నా కాలమ్ లేదా దాని ఆన్‌లైన్ వెర్షన్ చదవండి. అంటూ కాంగ్రెస్ కాలం నాటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటా.. వైరల్ గా మారింది.


Next Story

Most Viewed