- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గవర్నర్ చేతుల మీదుగా చేపూరి శంకర్‌కు అత్యుత్తమ రక్తదాన పురస్కారం
మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన చేపూరి శంకర్ కు అత్యుత్తమ రక్తదాన 20 26 పురస్కారం లభించింది.

దిశ, మర్రిగూడ: మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన చేపూరి శంకర్ కు అత్యుత్తమ రక్తదాన 20 26 పురస్కారం లభించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం-2026 సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చేపూరి శంకర్‌కు "అత్యుత్తమ రక్తదాన 2026" పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.
చేపూరి శంకర్ ఇప్పటివరకు 25 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, వేలాది మంది రక్తదాతలను ప్రేరేపించడంతో పాటు మానవతా సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడటంలో విశిష్ట సేవలు అందించారు. సమాజ సేవలో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సీఈఓ, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాములు, డీజీపీ మహేష్ భగవత్, సొసైటీ లీగల్ అడ్వైజర్ కె. జయరాజ్, ప్రముఖ రెడ్ క్రాస్ వైద్యుడు డాక్టర్ రామసుబ్బారెడ్డి, బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి, సంఘసేవకురాలు చేపూరి సునీత, ప్రియదర్శిని ఆర్కే, మనోరమ, భూతం మల్లయ్య, వెంకటమ్మ, సందీప్, సింధు, షేక్ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.






