- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్‌లో చెన్నైకి అందని ద్రాక్ష! 8 ఏళ్లుగా గెలుపుకు దూరం.
ఉప్పల్ స్టేడియంలో కొనసాగుతున్న చెన్నై శాపం! నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి పాలైన సిఎస్కే. 8 ఏళ్లుగా ఉప్పల్‌లో గెలవని రికార్డుతో పాటు పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు ఉప్పల్ స్టేడియంలో మరో చెత్త రికార్డును కొనసాగించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హోరాహోరీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. చెన్నై జట్టుకు ఉప్పల్ స్టేడియంలో ఉన్న ప్రతికూల రికార్డు మరో ఏడాది పొడిగించబడింది. 2018 నుండి ఈ మైదానంలో ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా చెన్నై గెలవలేకపోవడంతో, వారి విన్-లెస్ రికార్డు ఎనిమిదో ఏట అడుగు పెట్టింది. అంతేకాకుండా, 180 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై జట్టు 2019 నుండి ఎదుర్కొంటున్న కష్టాలు మరోసారి స్పష్టమయ్యాయి. గత ఏడాది ఒక మ్యాచ్‌లో ఈ మార్కును దాటినప్పటికీ, భారీ లక్ష్యాల ఛేదనలో ఆ జట్టు సక్సెస్ రేటు ఆందోళనకరంగా ఉంది.
ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌లలో ఇప్పటికే నాలుగింటిలో ఓడిన చెన్నై, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే రాబోయే మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (తలో 59 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌లతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. చివరి వరకు పోరాడినప్పటికీ 8 వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేసి లక్ష్యానికి స్వల్ప దూరంలో ఆగిపోయింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా, వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై ఏడో స్థానానికి పడిపోయింది.






