- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధోనీ ఆడకపోయినా.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హవా
ఐపీఎల్‌లో CSK అంచనాలను అందుకోలేకపోయినా, 308Mn వ్యూయర్లతో టాప్‌లో నిలిచింది. ధోనీ లేకున్నా పసుపు సెగ తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రదర్శన అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, ఆ జట్టుకు ఉన్న ప్రజాదరణ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. మైదానంలో ఫలితాలు ఎలా ఉన్నా, చెన్నై (CSK) జట్టు ఆడే మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) జట్టుకు దూరమైనా, ఆ పసుపు రంగు జెర్సీపై ఉన్న అభిమానం టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జరిగిన తొలి 43 మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే, అత్యధిక మంది వీక్షించిన జట్టుగా CSK అగ్రస్థానంలో నిలిచి తన సత్తా చాటుకుంది.
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా (డిజిటల్) డేటా ప్రకారం, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లు సగటున 308 మిలియన్ల వ్యూయర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (303 మిలియన్లు), ముంబై ఇండియన్స్ (293 మిలియన్లు) నిలిచాయి. ఆశ్చర్యకరంగా ఈ సీజన్‌లో మెరుగైన ఆటతీరు కనబరుస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 290 మిలియన్లతో నాలుగో స్థానంలో ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 280 మిలియన్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ డేటా ఆధారంగా జట్టులో మార్పులు జరిగినా, పాయింట్ల పట్టికలో వెనుకబడ్డ బ్రాండ్ వాల్యూలో తామే 'రాజు' అని చెన్నై మరోసారి నిరూపించుకుంది.






