చెపాక్‌లో చెన్నై చిత్తు..8 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం

by Malleboina Mahesh |   (  Updated:2026-04-26 15:58:49  IST  )

చెపాక్‌లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం! సాయి సుదర్శన్ (87) మెరుపు ఇన్నింగ్స్‌తో చెన్నైని 8 వికెట్ల తేడాతో ఓడించిన గుజరాత్.

చెపాక్‌లో చెన్నై చిత్తు..8 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియంలో గుజరాత్, చెన్నై జట్ల మధ్య మధ్యాహ్నం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో హోమ్ గ్రౌండ్ లో చెన్నై జట్టు చిత్తుగా ఓడిపోయింది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన గుజరాత్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా చేదించింది. గుజరాత్ టైటాన్స్ 20 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు. కేవలం 46 బంతుల్లోనే 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 87 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోపక్క జోస్ బట్లర్ (39) మరియు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (33) కూడా రాణించడంతో గుజరాత్ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. చివర్లో బట్లర్ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో నాలుగో విజయం ఖాతాలో వేసుకున్న గుజరాత్ జట్టు 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది.

Readmore...చరిత్ర సృష్టించిన కెన్యా రన్నర్.. రెండు గంటల్లోపే మారథాన్‌ను పూర్తి చేసిన తొలి రన్నర్‌గా వరల్డ్ రికార్డు

Next Story