- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చరిత్ర సృష్టించిన కెన్యా రన్నర్.. రెండు గంటల్లోపే మారథాన్‌ను పూర్తి చేసిన తొలి రన్నర్‌గా వరల్డ్ రికార్డు

దిశ, స్పోర్ట్స్ : కెన్యా రన్నర్ సెబాస్టియన్ సావె చరిత్ర సృష్టించాడు. 42 కిలోమీటర్ల లండన్ మారథాన్‌ను రెండు గంటలలోపే పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. ఇంతకుముందు ఎవరూ రెండు గంటలలోపు ఏ మారథాన్‌ను పూర్తి చేయలేకపోయారు. లండన్ మారథాన్‌లో సావె గంటా 59 నిమిషాల 30 సెకన్లలో రేసును పూర్తి చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. 2023లో కెన్యాకే చెందిన అథ్లెట్ కెల్విన్ కిప్టుమ్ 2:00:35 సెకన్లలో పూర్తి చేయగా.. సావె అంతకంటే 60 సెకన్ల ముందే ఫినిష్ చేసి రికార్డు బుక్‌లోకి ఎక్కాడు. అలాగే, ఈ మారథాన్‌లో టాప్-3 రన్నర్లు పాత వరల్డ్ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. ఇథియోపియాకు చెందిన యోమిఫ్ కెజెల్చా కూడా రెండు గంటల్లోపే రేసును ముగించాడు. 1:59:41 సెకన్లతో సెకండ్ ఫాస్టెస్ట్ మారథాన్‌గా నిలిచాడు. ఇక మూడో స్థానంలో నిలిచిన ఉగాండాకు చెందిన జాకబ్ కిప్లిమో 2:00:28 సెకన్లలో రేసును ముగించడంతో.. ఓ మారథాన్‌లో ముగ్గురు పాత వరల్డ్ రికార్డును బ్రేక్ చేయడం ఇదే తొలిసారిగా నిలిచింది.






