Chay- Shobitha: పెళ్లి పనులు షురూ.. హల్దీ వేడుకల్లో శోభిత ధూళిపాళ.. మరి నాగచైతన్య కనపడటం లేదేంటి..?

by Kavitha |
Chay- Shobitha: పెళ్లి పనులు షురూ.. హల్దీ వేడుకల్లో శోభిత ధూళిపాళ.. మరి నాగచైతన్య కనపడటం లేదేంటి..?
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ గత కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉంటూ.. రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున్ ‘X’ వేదికగా ప్రకటించి వీరి నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేశాడు. కానీ పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇక అప్పటి నుంచి వీరు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. ఈ క్రమంలో తాజాగా శోభిత పసుపు దంచుట కార్యక్రమం అంటూ కొన్ని ఫొటోలు తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని అర్థం అయిపోయింది. కాగా అక్టోబర్ చివరి వారంలో మ్యారేజ్ జరగనున్నట్లు అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో శోభిత హల్దీ ఫంక్షన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సిస్టర్ సమంత ధూళిపాళ్ల అందరికీ తెలిసిందే. డాక్టర్ అయిన ఈమె తన అక్క శోభిత కంటే ముందుగా సాహిల్‌ను పెళ్లాడింది. వీరి పెళ్లి 2022లో జరగ్గా.. తాజాగా సమంత ధూళిపాళ సడన్‌గా హల్దీ ఫంక్షన్ ఫొటోలు షేర్ చేసింది. ఇక ఈ పిక్స్‌లలో శోభిత తన బంధుమిత్రులతో కలిసి డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లికూతురు గెటప్‌లో శోభితాకు బదులు ఇంకో అమ్మాయి కనిపించింది.

అదేనండీ, ఆమె చెల్లెలు సమంత కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు నాగ చైతన్య- శోభిత పెళ్లి సమయంలో సమంత తన పెళ్లి నాటి సంగీత్ , హల్దీ వేడుకల ఫొటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా చై- శోభితల హల్దీ ఫంక్షన్ అని అనుకున్నారు. అంతేకాదు సడెన్‌గా చూసి ఏంటి శోభిత ఉంది కానీ, నాగచైతన్య లేరేంటి అని షాక్ అయ్యాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సమంత ధూళిపాళ.. శోభిత పసుపు దంచుట కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి సమంతకు సంబంధించిన మెహందీ, మ్యారేజ్, హల్దీ ఫంక్షన్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ షాక్ ఇస్తోంది.

Advertisement

Next Story