- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీలో లుకలుకలు.. ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే..
by Satheesh |
టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబుకు పార్టీ ఎంపీలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు బోకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్.. పుష్పగుచ్చం కేశినేని నానికి అందించారు. కానీ, ఎంపీ కేశినేని నాని బోకేను పక్కకు నెట్టివేసి.. బాబుకు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. ఢిల్లీ వేదికగా కేశినేని నాని అధినేత బాబుపై ఉన్న అసహనాన్ని వెళ్లగక్కారు. దీంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, గత కొన్ని రోజులుగా కేశినేని నాని పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






