Chandrababu Naidu: టీడీపీ నుంచి బీసీలను వేరు చేయలేం: చంద్రబాబు ట్వీట్

by Disha Web |
Chandrababu Naidu: టీడీపీ నుంచి బీసీలను వేరు చేయలేం: చంద్రబాబు ట్వీట్
X

దిశ, ఏపీ బ్యూరో : మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. సమసమాజ స్థాపనకు, విద్యావ్యాప్తికి, మహిళా సాధికారతకు తన జీవితం అంకితం చేసిన తొలి సమాజ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే. ఫూలే వంటి మహనీయుల ఆశయ స్ఫూర్తితో స్థాపించిన టిడిపి.. వెనకబడిన వర్గాలలో రాజకీయ చైతన్యం కలిగించి, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి 40 ఏళ్లుగా కృషిచేస్తోంది అని చెప్పుకొచ్చారు.

బీసీలది.. తెలుగుదేశం పార్టీది విడదీయలేని అనుబంధం. తెలుగుదేశం డీఎన్ఏలోనే బీసీల అభివృద్ధి ఇమిడి ఉంది. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనే వాస్తవం ఎవరూ కాదనలేనిది. రాష్ట్రంలో దేశంలో అన్ని రాజకీయ పార్టీలు నేడు బీసీల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించిందే తెలుగుదేశం. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు 26 ఏళ్ల పాటు అమల్లో ఉన్నాయంటే దానికి కారణం తెలుగుదేశమే. రాష్ట్రంలో టీడీపీ చైర్మన్ పదవితో పాటు.. 16 వర్శిటీల్లో 9 వర్శిటీలకు వీసీలుగా బీసీలను నియమించాం. ఆదరణ పథకంతో చేతి వృత్తిదారులకు ఉపాధినిచ్చాం. జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇకపోతే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే జయంతిని పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రతోపాటు ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed