- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ నాయకత్వంపై ప్రజల నమ్మకానికి ఇదే నిదర్శనం.. ఎన్డీయే విజయంపై చంద్రబాబు ప్రశంసలు!
ఎన్డీయే చారిత్రాత్మక విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఇది మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని, యువ భారతం అభివృద్ధికే పట్టం కట్టిందని ఆయన పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly election results) వెలువడుతున్నాయి. ఇందులో కేరళ, తమిళనాడు మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో.. బీజేపీ (BJP), ఎన్డీయే కూటమి (NDA alliance) భారీ విజయాన్ని సాధించాయి. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నాయకత్వంపై, ఆయన 'వికసిత్ భారత్' విజన్‌పై ప్రజలకున్న పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎన్డీయే నిలిచిందని, ఈ ఫలితంతో వికసిత్ భారత్ దిశగా సాగుతున్న ప్రయాణానికి మరింత బలం చేకూరిందని చంద్రబాబు ట్వీట్ చేశారు.
అభివృద్ధి పట్ల ఎన్డీయేకు ఉన్న నిబద్ధతను ప్రజలు పూర్తిస్థాయిలో సమర్థించారని ఈ తీర్పు ద్వారా స్పష్టమవుతోందని ఆయన విశ్లేషించారు. నేటి యువ భారతం విశ్వసనీయతకు, అభివృద్ధికే పట్టం కడుతుందని అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఫలితం ఒక బలమైన సందేశాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, గెలుపొందిన అభ్యర్థులకు, అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు చంద్రబాబు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.






