- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి అకాల వర్షాల గండం.. ఈ నెల 18 తర్వాత రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం!
రాష్ట్రంలో ఈ నెల 18 తర్వాత భారీ అకాల వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అప్పటివరకు 40°C పైగా ఎండలు ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

దిశ, వెబ్ డెస్క్: చలికాలం పోయి వేసవి కాలం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత (Intensity of sun) కొనసాగుతోంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ (Department of Meteorology) రాష్ట్రానికి భారీ వర్షాల అలర్ట్ (Heavy rain alert) జారీ చేసింది. ఈ నెల 18 లేదా 19వ తేదీ తర్వాత మరోసారి రాష్ట్రంలో అన్‌సీజనల్ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెల 23-24 తేదీల్లో కురిసిన వర్షాల కంటే ఈసారి వర్ష ప్రభావం మరింత భారీగా ఉండే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అకాల వర్షాల సూచన ఉన్నప్పటికీ, వర్షాలు ప్రారంభమయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు.
అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36-37°C మధ్య నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండలు ముదురుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదే సమయంలో రాబోయే భారీ వర్షాలకు అనుగుణంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






